వనపర్తి: వరి కొనుగోళ్లలో జాప్యం.. రైతులు ధర్నా

0చూసినవారు
వనపర్తి: వరి కొనుగోళ్లలో జాప్యం.. రైతులు ధర్నా
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం నెలకొందని భాజపా నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు అన్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని వెలుగొండలో బుధవారం రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. కోతలు ముగిసి నెలరోజులు గడుస్తున్నా కొనుగోళ్లు పూర్తి చేయకపోవడం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, కురుమయ్య, సంపత్, రాకేశ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్