వనపర్తి: మాజీ ఎంపీపీ కన్నుమూత

1చూసినవారు
వనపర్తి: మాజీ ఎంపీపీ కన్నుమూత
వయోభారంతో పాన్ గల్ మండల తొలి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు అన్నే నారాయణ(90) మంగళవారం రాత్రి జడ్చర్ల పట్టణంలో తన కుమార్తె ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామమైన వనపర్తి జిల్లా పాన్ గల్ మండలం రేమొద్దులకు కుటుంబ సభ్యులు తరలించారు. నారాయణకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆయన 1983లో టీడీపీ తరపున కొల్లాపూర్ సమితి ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో పాన్ గల్ మండల పరిషత్ అధ్యక్షుడుగా టీడీపీ తరపున విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్