వనపర్తి: నాలుగు ఆర్ఎంపీ క్లినిక్ లు సీజ్.!

591చూసినవారు
వనపర్తి: నాలుగు ఆర్ఎంపీ క్లినిక్ లు సీజ్.!
వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో ప్రథమ చికిత్స పేరుతో రోగుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ఏదుల ప్రజలు గ్రామ సర్పంచ్ పరశురామ్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, సోమవారం గ్రామంలోని 4 ఆర్‌ఎంపీ కేంద్రాలను సీజ్ చేశారు. సర్పంచ్ సమక్షంలో జరిగిన సమావేశంలో వివరణ ఇచ్చుకున్న ఆర్‌ఎంపీలకు ఆయన కఠిన హెచ్చరికలు జారీచేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, అత్యవసర సమయాల్లో వైద్యం నిరాకరించకూడదని, వృద్ధులు, వికలాంగులకు వద్దకే వెళ్లి సేవాభావంతో సేవలు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్