వనపర్తి ప్రభుత్వ ఎస్సీ కళాశాల బాలుర వసతి గృహం (బి)ని గురువారం ఉదయం జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ సహాయక అధికారి జె మల్లేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం రుచి చూసి, కార్యాలయ రికార్డులను పరిశీలించి, వసతి గృహంలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. స్టడీ చైర్లు, ప్యాకెట్ మనీ త్వరగా అందించాలని విద్యార్థుల కోరికకు సానుకూలంగా స్పందించారు. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ఫలితాలలో చరిత్ర విభాగంలో 39వ ర్యాంకు సాధించిన మహేష్ కు 'ప్రపంచ ప్రభావ శీలుర ఏడు అలవాట్లు' పుస్తకాన్ని బహుకరించారు.