శుక్రవారం మధ్యాహ్నం గోపాల్‌పేట మండల కేంద్రంలో ఇంటి యజమాని గాజుల జమ్ములు పొలం పనికి వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న ఎనిమిదిన్నర తులాల బంగారం, లక్ష రూపాయల నగదు, 10-15 తులాల వెండిని అపహరించుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.