భారతీయ పండుగలు వాటి విశిష్టతలను భావితరాలకు తెలిసే విధంగా ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు వనపర్తిలోని ఓ పాఠశాల డైరెక్టర్లు అరుణ, స్వాతి రెడ్డిలు అన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా వనపర్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థినిలకు ముగ్గుల పోటీలను నిర్వహించి పోటీలలో పాల్గొన్న విద్యార్థినిలను అభినందించారు. వారు మాట్లాడుతూ రంగవల్లులు సాంప్రదాయానికి ప్రతీకలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు.