వనపర్తి మున్సిపల్ కౌన్సిల్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 55.31 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఛైర్ పర్సన్ మాధవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పాల్గొన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేలా అధికారులు, కౌన్సిల్ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ బడ్జెట్ ద్వారా పట్టణ అభివృద్ధికి, ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.