వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ముగ్గురు యువకులు నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చి, ఒక ఇంటి ముందు ఆగి ఉన్న బుల్లెట్ బైక్ నుండి పెట్రోల్ దొంగిలించారు. ఈ దొంగతనం దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.