వనపర్తి: బాల్య వివాహాలపై సమాచారం ఇవ్వండి: కలెక్టర్

767చూసినవారు
వనపర్తి: బాల్య వివాహాలపై సమాచారం ఇవ్వండి: కలెక్టర్
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, గ్రామ స్థాయిలో బాల్య వివాహాలను అరికట్టడంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకమని తెలిపారు. మంగళవారం కొత్తకోట మండలంలోని పాలెంలో జరిగిన గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాల్య వివాహాలు లేదా పిల్లలపై వేధింపులు జరిగితే 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతారని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్