గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు మెంబర్ ఎన్నికలు పూర్తయి, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడదని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.