వనపర్తి జిల్లా కాసిం నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రూ.1.30 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు, త్వరలోనే నిధులు మంజూరవుతాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హామీ ఇచ్చారు. శనివారం ఎర్రగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ జిల్లెల్ల మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగరాజు, కిచ్చారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.