వనపర్తి: ఆర్టీసీ బస్సు బోల్తా... 30 మంది గాయాలు (Update)

794చూసినవారు
వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో సోమవారం 44వ జాతీయ రహదారిపై టీజీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు, స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 61 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మందికి గాయాలయ్యాయి. 8 మందిని కర్నూలు, 6 మందిని వనపర్తి ఆసుపత్రులకు తరలించారు.

సంబంధిత పోస్ట్