జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరవీరుల స్తూపానికి నివాళులు, జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆహ్వానితులందరికీ సకాలంలో ఆహ్వాన పత్రికలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.