వనపర్తి జిల్లా నాగవరం గ్రామంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రామకృష్ణ, ఎల్లయ్యలకు చెందిన 10 పందులను దొంగిలించారు. సుమారు రూ. 60 వేల విలువైన ఈ పందుల దొంగతనంపై బాధితుడు రామకృష్ణ శుక్రవారం వనపర్తి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితుడు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.