వనపర్తి: వీధి కుక్కల హల్ చల్.. మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

605చూసినవారు
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో ఆదివారం వీధి కుక్క దాడిలో మూడేళ్ల మహ్మద్ ఖాన్ అనే బాలుడు ఆదివారం  తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలుడిపై కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. గాయపడిన బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ వీధి కుక్కల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని, ప్రజా సమస్యల పరిష్కారంలో వారి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.