వనపర్తి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 6 నెలలుగా వదిలివేయబడిన 130 వాహనాలను వాటి యజమానులు వెంటనే తీసుకెళ్లాలని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి శనివారం సూచించారు. గడువులోగా తీసుకెళ్లని వాహనాలను పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 26 ప్రకారం బహిరంగ వేలం వేస్తామని ఆమె హెచ్చరించారు. సరైన పత్రాలతో వాహనాలను క్లెయిమ్ చేసుకోవాలని, గడువు ముగిసిన తర్వాత వాటిని ప్రభుత్వ ఆస్తిగా పరిగణించి వేలం నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు.