వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాత సూగురు సమీపంలోని వ్యవసాయ పొలంలో బుధవారం సాయంత్రం పిడుగు పడింది. ఈ ఘటనలో పొలంలో పనిచేస్తున్న లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. సువర్ణ, అనురాధ అనే ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది క్షతగాత్రులను వనపర్తి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.