చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడాలి..ఎమ్మెల్యే

457చూసినవారు
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడాలి..ఎమ్మెల్యే
భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ ధీరత్వ స్ఫూర్తిని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. శనివారం వనపర్తిలో జరిగిన ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. నిజాం పాలన, భూస్వాముల దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన ఐలమ్మ ధైర్యసాహసాలు ఆదర్శనీయమని, ఆమె చొరవ తెలంగాణ సాయుధ పోరాటంలో మైలురాయిగా నిలిచిందని తెలిపారు. ఐలమ్మ త్యాగాలు, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్