తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి,
కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు గురువారం వనపర్తిలో పేర్కొన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పాత్ర మరువలేనిదని, తొలి, మలి ఉద్యమాలను నిర్వహించిన తీరును వివరించారు. స్వరాష్ట్ర సాధనకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని, రాష్ట్ర అభివృద్ధికి మంచి ప్రణాళికలు సైతం రూపొందించారని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు మనమంతా కృషి చేయాలని దేవన్న పేర్కొన్నారు.