వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ శనివారం యువతకు పిలుపునిచ్చారు. చదువు, క్రమశిక్షణ, సమాజ సేవతో దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. మన దేశం సరిహద్దులతోనే కాకుండా మనసుల ఐక్యతతో బలంగా ఉంటుందని, ఐక్యత అంటే ఒక కుటుంబం అన్న భావనతో ముందుకు సాగడమేనని ఆయన పేర్కొన్నారు. యువత ఒక లక్ష్యం, ఒక దిశ, ఒక దేశం కోసం పరుగెత్తి, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని ఎస్పీ సూచించారు.