శాంతిని కోరుకున్నామంటే భారత్ వీక్ అని కాదు: రాజ్‌నాథ్ సింగ్

17చూసినవారు
శాంతిని కోరుకున్నామంటే భారత్ వీక్ అని కాదు: రాజ్‌నాథ్ సింగ్
జాతీయ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, యుద్ధాన్ని కోరుకోదని పేర్కొన్నారు. అయితే శాంతియుత వాతావరణాన్ని కోరుకున్నంత మాత్రాన భారత్‌ బలహీన దేశం కాదని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానెల్‌ నిర్వహించిన డిఫెన్స్‌ సమిట్‌ 2026లో ఆదివారం ఆయన మాట్లాడారు. భారత్‌పై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్నంతకాలం గట్టిగా బదులిస్తామని పాకిస్తాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. భారత్‌పై మరోసారి ఉగ్రదాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్