
ఓజీ' కి ఆ పాట మరింత ఫ్రెష్ ఎనర్జీనిస్తుంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రానికి సోమవారం (సెప్టెంబర్ 29) నుంచి నేహా శెట్టిపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ అదనంగా జోడించనున్నారు. సినిమా విడుదల సమయంలో ఈ పాట లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, తొలుత కథనానికి అడ్డుగా ఉందని తొలగించినా, ఇప్పుడు రీవర్క్ చేసి చేర్చామని, ఇది సినిమాకు మరింత ఫ్రెష్ ఎనర్జీనిస్తుందని తెలిపారు. ఈ పాట చేరికతో మాస్ ప్రేక్షకులకు 'ఓజీ' మరింత చేరువకానుంది.




