
కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన గిల్
కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీపై తొలిసారి స్పందించారు. డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ నింపే స్ఫూర్తి గొప్పదని టీమ్ యూనిటీ విషయంలో అతని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. ప్రశాంతంగా ఉంటూ జట్టులో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపే విషయాలను నేర్చుకుంటానని తెలిపారు. రోహిత్, కోహ్లీ మ్యాచ్ విన్నర్లని టీమిండియాకు అలాంటి అనుభవం ఉన్న ఆటగాళ్ల అవసరం ఉందని పేర్కొన్నారు.




