
ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించాలన్న క్యాట్ ఆదేశాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమ్రపాలి కేటాయింపులో తాత్కాలిక అడ్డంకి ఏర్పడింది. హైకోర్టు ఆమ్రపాలికి కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ, తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.




