
ఓటర్ల జాబితా సవరణపై ఈసీఐ ఏకగ్రీవం.. విభేదాలు లేవని ప్రకటన
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే చేపడుతున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీల ఏకగ్రీవ ఆమోదంతోనే ఈ ఆదేశం జారీ అయ్యిందని శనివారం పేర్కొంది. 'సర్' అంశంలో ఎన్నికల సంఘంలో విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ముగ్గురు కమిషనర్లు సమావేశమై, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఒక ప్రకటన జారీ చేశారు.




