ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం దాడుల్లో ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ IRIB (Islamic Republic of Iran Broadcasting) ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు సమాచారం. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ “ఆపరేషన్ హానెస్ట్ ప్రామిస్ 4” పేరిట దాడులు ప్రారంభించింది. ఇప్పటికే 11వ విడత క్షిపణి దాడులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేపట్టినట్లు ఇరాన్ ప్రకటించింది.