యుద్ధం.. పెరగనున్న పప్పు ధాన్యాల ధరలు!

14చూసినవారు
యుద్ధం.. పెరగనున్న పప్పు ధాన్యాల ధరలు!
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో.. నౌకా సరకు రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతో అంతర్జాతీయంగా పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మనదేశం ఏటా 5-6 మిలియన్ టన్నుల మేర కంది పప్పు, పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలను మయన్మార్, కెనడా, ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఉద్రిక్తతల వల్ల రవాణా వ్యయాలు పెరిగినా.. ఆ భారం సామాన్యులపై పడనుంది. దాంతో రిటెయిల్ ధరలు పెరగవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్