ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో షార్జాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమను స్వదేశానికి తరలించాలని, తమను పట్టించుకునేవారు ఎవరూ లేరని, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని విజయనగరానికి చెందిన టైటస్ అనే వ్యక్తి ఓ వీడియోను విడుదల చేశారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.