ఇరాన్- అమెరికా యుద్ధం అమెరికా ఖజానాపై భారీ భారం మోపుతోంది. యుఎస్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) నివేదిక ప్రకారం యుద్ధం ప్రారంభమైన తొలి 100 గంటల్లోనే సుమారు 3.7 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఆరు రోజుల్లో ఈ వ్యయం 11 బిలియన్ డాలర్లకు చేరింది. సగటున రోజుకు దాదాపు 891 మిలియన్ డాలర్లు ఖర్చవుతున్నట్లు అంచనా. అత్యాధునిక ఆయుధాలు, స్టెల్త్ బాంబర్‌ల వినియోగం కారణంగా ఖర్చు భారీగా పెరుగుతోంది.