రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు యుద్ధంలో 5 లక్షల మందికిపైగా రష్యా సైనికులు మృతి చెందారని యూకే నిఘా విభాగం జీసీహెచ్‌క్యూ వెల్లడించింది. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడిని ప్రారంభించినప్పటి నుంచి ఈ భారీ ప్రాణనష్టం జరిగినట్లు GCHQ డైరెక్టర్ ఆన్ కీస్ట్-బట్లర్ పేర్కొన్నారు. బ్లెచ్లీ పార్క్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లోని మౌలిక వసతులను రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని, ఇదే పరిస్థితి కొనసాగితే దాని పర్యవసానాలు బ్రిటన్ పైనా ప్రభావం చూపిస్తాయని ఆమె అన్నారు.