
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం (వీడియో)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కుసుమ రామయ్య జడ్పీ పాఠశాలలో తరగతి గదిని చీపురుతో శుభ్రం చేస్తుండగా, అకస్మాత్తుగా బండి సంజయ్ పై బెంచి పడబోయింది. వెంటనే అప్రమత్తమైన బీజేపీ నాయకులు ఆ బెంచ్‌ను పక్కకు తొలగించి ఆయనను రక్షించారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు కలకలం రేగింది.

































