వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 108 మంది పట్టుబడ్డారు. ట్రాఫిక్ విభాగంలో అత్యధికంగా 60 కేసులు, సెంట్రల్ జోన్‌లో 27, వెస్ట్ జోన్‌లో 11, ఈస్ట్ జోన్‌లో 10 కేసులు నమోదయ్యాయి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.