Dec 06, 2025, 17:12 IST/
కొల్చారం మండలంలో సర్పంచ్‌లు ఏకగ్రీవం
Dec 06, 2025, 17:12 IST
TG: మెదక్ జిల్లా కొల్చారం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. డిసెంబర్ 6న విడుదలైన తుది జాబితా ప్రకారం, ఏటిగడ్డ మాందాపూర్‌లో పేరోళ్ల కమలమ్మ, వసురం తండాలో వినోద్ నాయక్ లు ఏకగ్రీవంగా సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. వీరిని బీఆర్ఎస్ బలపరిచింది. పోతిరెడ్డిపల్లిలో కాంగ్రెస్ మద్దతు తెలపడంతో శేఖర్ రెడ్డి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని మొత్తం 21 గ్రామ పంచాయతీలకు 87 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.