
టేకుమట్లలో అగ్ని మాపక కేంద్రం ఏర్పాటు చేయాలి
టేకుమట్ల, చిట్యాల, మొగుళ్ళపల్లి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే భూపాలపల్లి నుండి అగ్నిమాపక వాహనం రావడానికి ఆలస్యం అవుతుందని, దీనివల్ల ధన, ప్రాణ నష్టం జరుగుతుందని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. వెంటనే టేకుమట్ల మండలంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.



































