వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, ఫసల్ బీమా అమలు చేయాలి: బీజేపీ

3చూసినవారు
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, ఫసల్ బీమా అమలు చేయాలి: బీజేపీ
గణపురం మండలం కేంద్రంలో ఉన్న విద్యుత్ ఉపకేంద్రం ముందు బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, రైతులకు జరుగుతున్న విద్యుత్ కోతలను వెంటనే నిలిపివేయాలని, పంటలకు సాగునీరు అందేలా విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించాలని బీజేపీ మండల కన్వీనర్ మంద మహేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వెంటనే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కూడా వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్