భూపాలపల్లి జిల్లా సంక్షేమ భవన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి బి. రామ్మోహన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బాపూజీ పాత్ర, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి చేసిన సేవలను స్మరించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధుడు చిందం రాయమల్లు, బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.