గణపురం మండల కేంద్రంలో ఐబి రోడ్డు కాలనిలో సాయిరాం యూత్ ఆధ్వర్యంలో సోమవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమనికి ముఖ్య అతిధిగా సర్పంచ్ కటుకూరి రాధికా శ్రీనివాస్, టాస్క్ పోర్స్ సిఐ బూర రాజగోపాల్ గౌడ్, రజిత దంపతులు ప్రారంభించారు. ఈసందర్బంగా గణపతి దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సాయిరాం యూత్ సభ్యులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.