జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామంలో మంతెన రజిత (36) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. రాత్రి నిద్రలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.