జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకట్రావుపల్లిలో, వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త రవిని కరెంట్ షాక్‌తో హత్యాయత్నం చేశారు. భార్య లక్ష్మి, ఆమె ప్రియుడు రాజు కలిసి జూన్ 9 రాత్రి నిద్రిస్తున్న రవి మంచానికి కరెంట్ వైర్లు చుట్టి, కాళ్లకు తగిలించే ప్రయత్నం చేశారు. అలికిడికి రవి మేల్కొని కేకలు వేయడంతో స్థానికులు రావడంతో నిందితులు పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు టేకుమట్ల ఎస్సై జి. అమూల్య కేసు నమోదు చేసి, నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.