భూపాలపల్లి జిల్లాలో గడిచిన 24 గంటలలో 176.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని భూపాలపల్లిలో ఈ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా చూస్తే మహాదేవపూర్ 23.4 మి.మీ, పలిమెల 25.4 మి.మీ, మహముత్తారం 11.8 మి.మీ, కాటారం 19.8 మి.మీ, మల్హర్ 39.4 మి.మీ, చిట్యాల 6.0 మి.మీ, టేకుమట్ల 7.4 మి.మీ, మొగుళ్లపల్లి 6.0 మి.మీ, రేగొండ 5.8 మి.మీ, గణపురం 6.2 మి.మీ, భూపాలపల్లి 25.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.