భూపాలపల్లి జిల్లా కాటారం మహా ముత్తారం మధ్యలో గల అంకుసాపూర్ వాగులో శనివారం సాయంత్రం మహాముత్తారం మండలం ములుగుబల్లి గ్రామానికి చెందిన కోర్రెల రాజు తన ద్విచక్ర వాహనంపై వాగు దాటుతుండగా, వరద ఉధృతికి వాహనంతో పాటు కొట్టుకుపోయాడు. రాజు ద్విచక్ర వాహనాన్ని వదిలి ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చి, అక్కడున్న వారి సహాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. లో లెవల్ బ్రిడ్జిల నిర్మాణంతో ప్రతి ఏడాది ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని, గతంలో ఇలాంటి సంఘటనలో ఒక యువకుడు మృతి చెందాడని స్థానికులు తెలిపారు. యువకుడు సురక్షితంగా బయటపడడంతో అతని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.