భూపాలపల్లి: ఈతకు వెళ్లి బాలుడు మృతి

72చూసినవారు
భూపాలపల్లి: ఈతకు వెళ్లి బాలుడు మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొంపల్లి గ్రామంలో ఈతకు వెళ్లి 17 ఏళ్ల శ్రీపతి జస్వంత్ మృతి చెందాడు. శనివారం స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్ళిన బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జస్వంత్‌కు ఈతరాదని తెలిసింది.