సిరిసిల్లలో జరిగిన బహిరంగ సభలో బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం, భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే గండ్ర సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లికి సంబంధించిన అంశాలపై జరిగింది.