భూపాలపల్లి మండలం గొర్లవేడు గ్రామంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం
బీజేపీ జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు ఆధ్వర్యంలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నె ముఖ్య అతిథిగా హాజరై, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను సన్మానించారు. ప్రధాని నరేంద్ర
మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు ఈ సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమని జన్నె కొనియాడారు.