ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0చూసినవారు
భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ, సీమాంధ్ర పాలకుల అన్యాయాన్ని సహించలేక, తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రం అవసరమనే ఉద్దేశ్యంతో 2001లో 'మన నిధులు, మన నియామకాలు, మన నీళ్లు మనకే' అనే దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ (అప్పటి తెరాస) పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you