పార్లమెంట్‌లో డ్యామ్‌ల భద్రతపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ కేటగిరీ-1 ప్రమాదకర డ్యామ్‌గా ఉందని జల్‌శక్తిశాఖ వెల్లడించింది. దేశంలో 50 ఏళ్లు పైబడిన డ్యామ్‌లు 1,681 ఉన్నాయని, వీటిలో మేడిగడ్డ, లోయర్ ఖజురి(యూపీ), బొకారో(ఝార్ఖండ్) డ్యామ్‌లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా డ్యామ్‌లను తనిఖీలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.