ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లిలోని కొత్తపల్లి గోరి మండల కేంద్రంలోని గురుదేవ ఆశ్రమంలో శుక్రవారం సప్తాహ కార్యక్రమంలో భాగంగా 7వ రోజు చండీ హోమం నిర్వహించారు. సహజానంద స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివనామస్మరణ, చండీ సప్తశతి పారాయణ జరిగాయి. దుర్భిక్షం, దుఃఖం, అకాల మరణాలను దూరం చేసి లోక కల్యాణం, సర్వజనుల హితం చేకూరుస్తుందని స్వామీజీ తెలిపారు. ఈ యాగంలో కొత్తపల్లి గోరి గ్రామ సర్పంచ్ నిమ్మల శంకర్, నిజాంపల్లి గ్రామ సర్పంచ్ న్యాండ్ల సునిత రవీందర్ పాల్గొన్నారు.