గోరి కొత్తపల్లిలో రేపు చండీయాగం

13చూసినవారు
గోరి కొత్తపల్లిలో రేపు చండీయాగం
ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లిలోని గోరి కొత్తపల్లి మండల కేంద్రంలోని గురుదేవ ఆశ్రమంలో అఖండ శివనామ సప్తాహంలో భాగంగా రేపు (శుక్రవారం) చండీయాగం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాగం విశ్వశాంతి, జగత్కల్యాణం కోసం చేపట్టినట్లు శ్రీశ్రీశ్రీ సహజానంద స్వాములవారు తెలిపారు. గత 6 రోజులుగా 'శివాయ నమః ఓం' నామస్మరణ కొనసాగుతోంది. భక్తులు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్