భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం శనివారం రోజున వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద నిర్వహించడం జరుగుతుందని రజక సంఘం నాయకులు కోరపల్లి రాజేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, బీసీ సంఘం నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.