చిట్యాల ప్రభుత్వ ఇంటర్ కళాశాల ప్రిన్సిపాల్ బి. శ్రీదేవి, 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యమైన బోధన, నైపుణ్యాభివృద్ధికి తమ కళాశాల సిద్ధంగా ఉందని తెలిపారు. CEC, HEC, BIPC, MPC, ACE కోర్సులు అందుబాటులో ఉన్నాయని,
విద్యార్థులు పట్టణాలకు వెళ్లి ఖర్చు చేయకుండా, మండల కేంద్రంలోనే 100% ఫలితాలతో గౌరవప్రదమైన గుర్తింపు పొందాలని సూచించారు. నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, NSS, మధ్యాహ్న భోజనంతో పాటు మంచి అధ్యాపక బృందం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి.